లెమ్ము తేజరిల్లుము
పల్లవి :
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద
1. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి
ఇదియే భాగ్యము - ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద
2. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటము నే పొందుటకే - నను చేరదీసితివి
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద
3. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నినుచూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
నిన్నే స్మరించుకొనుచు - నీ సాక్షిగా ప్రకాశించుచు
No comments:
Write CommentsSuggest your Song in the Comment.